ఏపీలో చెత్త నుంచి విద్యుత్ తయారు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టునున్నారు. ఏపీలో మొదటగా గుంటూరు జిల్లాలో ఈ ప్లాంట్ ను మొదలు పెట్టనున్నారు. గుంటూరులో చెత్త సమస్య వేధిస్తోంది. ఈ చెత్తను విద్యుత్ గా మార్చేందుకు జిందాల్ కంపెనీ ఆధ్వర్యంలో రూ.340 కోట్లతో విద్యుత్ తయారీ ప్లాంట్ ప్రారంభం కానుంది. విజయవాడ, గుంటూరు నగరాలే కాకుండా మరో 7 మున్సిపాలిటీల్లోని చెత్తను ఇక్కడికి తరలించనున్నారు.