ఆంధ్రప్రదేశ్ వైసీపీ బహిష్కృత ఎమ్మెల్సీ అనంతబాబు వద్ద డ్రైవర్గా పనిచేసిన సుబ్రమణ్యం అనే వ్యక్తిని హత్య చేసిన కేసులో అనంతబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారణ మళ్లీ వాయిదా పడింది. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టు విచారణను ఈ నెల 15కి వాయిదా వేసింది.ఈ కేసులో అనంతబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.