అకస్మిక ప్రమాదాల నుంచి బయటపడటం అంటే సామాన్యమైన విషయం కాదు. ఊహించని అగ్ని ప్రమాదంను వెంటనే పసిగట్టిన ఓ కుటుంబం అందులోనుంచి చాకచక్యంగా బయటపడింది. నెల్లూరు జిల్లాలో కదులుతున్న కారులో మంటలు కలకలంరేపాయి. ఉలవపాడు జాతీయ రహదారిపై ఒక్కసారిగా కారులో మంటలు మొదలయ్యాయి. ఆ కారులో ప్రయాణిస్తున్న భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలు సకాలంలో వెంటనే అప్రమత్తమై బయటికి దిగటంతో ప్రమాదం తప్పింది. ఈ కుటుంబం గుంటూరు నుంచి బెంగళూరు వెళుతుండగా మన్నేటికోట అడ్డ రోడ్డు దగ్గర ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పేశారు. కారులో మంటలు చెలరేగడానికి కారణాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa