సుండుపల్లె మండలంలో ని బండకాడ ఈడిగపల్లి లో వెలసిన నాగలరమ్మ జాతర వైభవంగా జరిగింది. చాందిని బండ్లు కట్టిన భక్తులు ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. మూడేళ్ల తర్వాత జాతర జరుగుతూ ఉండడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కోలాటాలు, నృత్యాలు, విద్యుద్దీపాలతో చాందిని బండ్లు కోలాహలంగా తరలివచ్చాయి.