గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా బంగారుపాలెం మండలం పరిధిలోని సర్పంచ్ జి మాలతీ ప్రతాప్ ఆధ్వర్యంలో బండ్లదొడ్డి గ్రామానికి చెందిన టిడిపి పార్టీ కి చెందిన 120 మంది వైఎస్ ఆర్ పార్టీ లో చేరారు. వీరిని పూతలపట్టు ఎమ్మెల్యే ఎం ఎస్ బాబు పార్టీ కండువాలు కప్పి వైఎస్ ఆర్ పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమం లో జిల్లా వ్యవసాయ సలహామండలి అధ్యక్షులు పాలేరు రామచంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.