5 సంవత్సరముల లోపు పిల్లలకు అతిసారాన్ని నియంత్రించుటకు తల్లులకు ఓఆర్ఎస్ మరియు జింక్ మాత్రల వాడకం పై గ్రామ స్థాయి వరకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సంయుక్త కలెక్టర్ జి. రాజకుమారి ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం కలక్టరేట్ శంకరన్ సమావేశ మందిరoలో ఉదృత అతిసార నియంత్రణ పక్షోత్సవ కార్యక్రమంలో భాగంగా జేసి రాజకుమారి గోడప్రతులను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పలువురు వైద్యాధికారులు పాల్గొన్నారు.