మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో సోమవారం వింత ఘటన చోటుచేసుకుంది. తమకు భార్యలు వద్దంటూ భార్యాబాధితుల సంఘం సభ్యులు పూజలు చేశారు. సాధారణంగా వట సావిత్రి పౌర్ణమి రోజున మహిళలు ఏడు జన్మలకూ ఒక్కరే భర్తగా రావాలని పూజలు చేస్తుంటారు. అయితే ఏడు జన్మలు కాదు.. ఏడు సెకన్లు కూడా ఈ భార్యలు వద్దంటూ భార్యాబాధితుల సంఘం సభ్యులు పూజలు చేశారు.