చెల్లని చెక్కు కేసు నిందితుడికి ఏడాది జైలు, ఆరు లక్షల రూపాయలను ఫిర్యాది కి నష్ట పరిహారంగా చెల్లించాలని రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి అంజయ్య తీర్పునిచ్చారు. వివరాల్లోకి వెళితే పట్టణానికి చెందిన తల్లం వెంకట సుబ్బారావు వద్ద నిందితుడు పల్లె బోయిన వేమన మూడు లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. చెల్లింపు లో భాగంగా చెక్కు ఇచ్చాడు. బ్యాంకులో జమ చేయగా నిధులు లేకపోవడంతో బాధితులు కోర్టును ఆశ్రయించాడు.