చెల్లని చెక్కు కేసులో పోస్టల్ ఉద్యోగికి ఏడాది జైలు, రూ.8 లక్షల నష్టపరిహారాన్ని ఫిర్యాదు చెల్లించాలని మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఇన్ఛార్జి న్యాయమూర్తి అంజయ్య తీర్పునిచ్చారు. పట్టణానికి చెందిన తుమ్మూరు పెరుమాళ్ళ రెడ్డి వద్ద నిందితుడు రూ.4లక్షలు అప్పుగా తీసుకున్నాడు. బాకీ చెల్లింపులో భాగంగా చెక్కు ఇచ్చాడు. సదరు చెక్కు బ్యాంకులో జమ చేయ గా నిధులు లేకపోవడంతో ఫిర్యాది కోర్టును ఆశ్రయించాడు.