కంతేరు ఘటనతో మనస్తాపంతో పల్లపు సునీత (బుజ్జి) ఆత్మహత్యాయత్నం చేశారు. తన కుమార్తె పరువు బజారున పడేలా టీడీపీ నాయకులు వ్యవహరిస్తున్న తీరుతో మనస్తాపం చెందానని ఉరి వేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో ప్రాథమిక చికిత్స అనంతరం స్థానికుల సహాయంతో మంగళగిరి ఎన్ ఆర్ ఐ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందజేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.