కల్లూరు మండలం లోని లక్ష్మీపురం గ్రామంలో ఇటీవల అగ్ని ప్రమాదం సంభవించి గడ్డివాములు నష్టపోయిన బాధిత రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం కర్నూలులోని కలెక్టరేట్లో డిఆర్ఓ నాగేశ్వరరావును కలిసి సమస్యను వివరించారు. గడ్డివాములు దగ్ధం కావడంతో బాధిత రైతులు తీవ్రంగా నష్టపోయారని సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి రైతులకు నష్టపరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈమె వెంట పలువురు బాధిత రైతులు ఉన్నారు.