పర్చూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ ఛార్జి రావి రామనాథంబాబు తన వద్ద నుండి కమీషన్లు గుంజారంటూ కుప్పాల గోపీకృష్ణ అనే కాంట్రాక్టర్ విడుదల చేసిన ఆడియో టేప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ నియోజకవర్గ పరిధిలో తాను ప్రభుత్వ భవనాల నిర్మాణాన్ని చేపట్టగా కోటి యాభై లక్షల రూపాయల పనులకు గాను ముప్పై లక్షలు రామనాథంబాబు కమీషన్ తీసుకున్నారని, ఇంకా చాలలేదని తనను ఇబ్బందులు పెడుతున్నారు ఆ ఆడియోలో గోపీకృష్ణ వాపోయారు