శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు పరిధిలో రైల్వే కార్మికులు మరో అద్భుతాన్ని చేసి చూపించారు. కేవలం ఐదు గంటల్లో అండర్ పాసేజ్‌ని కట్ అండ్ కవర్ మెథడ్‌లో నిర్మించారు. పూండి లెవిల్ క్రాస్ సమీపంలో ముందుగానే పనులు చేపట్టిన చోట అండర్ పాసేజ్ స్ట్రక్చ ర్స్ నిర్మించి రైల్వే ట్రాక్‌లను కట్ చేసి వాటిని ట్రాక్ కింద అమర్చారు. రైల్వే శాఖకు చెందిన సీనియర్ డివిజినల్ ఇంజనీర్ (ఈస్ట్)రాజీవ్‌కుమార్, అసి స్టెంట్ డివిజనల్ ఇంనీర్ ఎంవీ రమణ, ఏడీఈఈ (టీఆర్‌డీ)ఎ.శ్రీరామ్మూర్తి, సీనియర్ సెక్షన్ ఇంజినీర్ డేవిడ్ రాజు పర్యవేక్షణలో అప్, డౌన్ లైన్‌లలో పనులు చకచకా పూర్తి చేశారు.
మధ్యాహ్నం ఒంటి గంటకు ఇంటర్‌సిటీ వెళ్లాక పనులు మొదలుపెడితే సాయంత్రం 6 గంటలకు పనులన్నీ పూర్తయిపోయాయి. దాదాపు 50 మంది రైల్వే ఉద్యోగులు 200 మంది కార్మికులు 2.50 టన్నుల బరువైన రెండు భారీ హైడ్రాలిక్ క్రేన్‌లు, నాలుగు భారీ పొక్లెయినర్స్ ఉపయోగించి రూ.3 కోట్ల వ్యయంతో పనులను అనుకున్న సమయానికి ముందే పూర్తి చేశారు. 110 కిలోమీటర్ల వేగంతో రైళ్లు వెళ్లేలా ఇలా అండర్‌పాసేజ్‌లను నిర్మిస్తున్నారు.