కొత్త పెన్షన్లును మంజూరు చేసి పేదవారిని ఆదుకోవాలని బొబ్బిలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త ఆర్.వి.ఎస్.కె.కె. రంగారావు (బేబినాయన) డిమాండ్ చేశారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం పేదప్రజల జీవనవిధానంపై, సంక్షేమపథకాల పేరుతో ప్రజల నిత్యావసర వస్తువులపై బ్రతకడానికి మోయలేని పన్నుల భారంతో బాధించడమే కాకుండా, ప్రతీ సంవత్సరం జనవరి నెలలో కొత్తగా మంజూరు చేస్తున్నటువంటి వృద్ధాప్య, వికలాంగుల, వితంతువుల, ఇతర పెన్షన్లును ఈ సంవత్సరం ఇంతవరకు కూడా మంజూరు చేయకుండా జాప్యం చేయడం చాలా దారుణం. చాలామంది కొత్త పెన్షన్స్ కు అర్హులైన పేదవారు అందరూ వారికి పెన్షన్ మంజూరు చేయాలని వేయికళ్ళతో ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం వెంటనే ఈ కొత్త పెన్షన్లుపై దృష్టిపెట్టి మంజూరుచేసి పేదవారిని ఆదుకోవాలని ఈ పత్రికాముఖంగా నేను డిమాండ్ చేస్తున్నానని అన్నారు.