నగరంలోని లంకాపట్నంలోని హుదూద్ ఇళ్లకు విద్యుత్, మంచినీటి సదు పాయం కల్పించాలని సీపీఎం నగర కార్యదర్శి రెడ్డి శంకరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లంకా పట్నంలో సోమవారం ఇంటింటికీ సీపీఎం కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజా సమ స్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగడుతూ కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పార్టీ నేతలు సురేష్, బి. రమణ, జగదాంబ పాల్గొన్నారు.