మదనపల్లి పట్టణం బసినికొండ కు చెందిన లారీ డ్రైవర్ ఖాదరవల్లి (57) పుంగనూరు లోని ఓ లారీ యజమాని దగ్గర డ్రైవర్ గా పని చేస్తున్నాడు. విధులు ముగించు కుని స్వగ్రామమైన మదనపల్లికి తన ద్విచక్ర వాహనంలో వస్తుండగా మార్గమధ్యంలోనే 150 మైలు దగ్గర ఆటో బైకుకు అడ్డురావడంతో అదుపుతప్పి ప్రమాదవశాత్తు కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాధితుని 108 సిబ్బంది మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు.