తులసి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. గొంతునొప్పి, నోటి దుర్వాసన, నోట్లో పొక్కులు లాంటి ఎన్నో సమస్యలకు తులసి ఆకులతో చెక్ పెట్టొచ్చు. మరి తులసి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
నోటి దుర్వాసన సమస్య ఉన్నవారు ప్రతిరోజూ రాత్రి నీళ్లలో తులసి ఆకులను నానబెట్టి.. మరుసటి రోజు ఉదయాన్నే ఆ నీటితో పళ్లు తోముకోవాలి. ఇలా చేస్తే నోటి దుర్వాసన పోతుంది. నోట్లో పొక్కులు కూడా మానిపోతాయి.
గొంతు నొప్పి సమస్య ఉన్నవాళ్లు నీళ్లలో తులసి ఆకులు వేసి బాగా మరిగించాలి. ఆ తర్వాత ఆ నీళ్లు గోరువెచ్చగా మారగనే తాగాలి. దాంతో గొంతునొప్పి మటుమాయం అవుతుంది.
తులసి రసంలో తేనె కలిపి తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ రెండింటిలోనూ యాంటీ సెప్టిక్ గుణాలు ఉంటాయి. అందు వల్ల చర్మ సమస్యలు దరిచేరవు. సాధారణ జలుబు, దగ్గు కూడా తగ్గుతాయి. నోటిపూతకు కూడా ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది.
తులసి ఆకులకు శరీరంలో కొవ్వును తగ్గించే గుణం కూడా ఉంటుంది. తులసి ఆకులను ప్రతిరోజూ మజ్జిగతో కలిపి తీసుకుంటే బరువు అదుపులో ఉంటుంది.
నిద్రలేమితో బాధపడేవారు తులసి ఆకులను చక్కెరతో కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.