అంతర్జాతీయ రక్త దాతల దినోత్సవం ప్రతి ఏటా జూన్ 14న నిర్వహిస్తారు. ఆస్ట్రేలియాకు చెందిన నోబెల్ విజేత 'కార్ల్ లాండ్‌స్టీనర్' జయంతిని పురష్కరించుకుని ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.1901లో ప్రజలకు రక్తం విలువ తెలిజేయాలనే ఉద్దేశంతో మొదటిసారిగా రక్తాన్ని వర్గీకరించి దీన్ని కృత్రిమంగా తయారు చేయడానికి వీలుకాదని చెప్పిన ఆయన.. మనుషులు తమ రక్తాన్ని దానం చేసి మరొకరి ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు.అలాగే 18 - 55ఏళ్ల లోపు ఎవరైనా రక్తదానం చేయవచ్చని చెప్పిన కార్ల్.. రక్తదానం చేస్తే బలహీనపడి నీరసించిపోవడం, నొప్పులు, ఎయిడ్స్ బారిన పడతారనే అపోహలను నమ్మొద్దని కోరాడు. ఇక ఏ రకమైన వ్యాధి సోకే అవకాశంలేని విధంగా పూర్తి శాస్ర్తీయమైన, సురక్షితమైన పద్ధతుల్లో రక్తదానం కార్యక్రమాలను నిర్వహిస్తుండగా 2004 నుంచి అన్ని దేశాలు ఇంటర్నేషనల్ బ్లడ్ డోనార్ డే పాటిస్తున్నాయి.