టమాటాలతో అనేక రకాల చర్మ సమస్యలకు చెక్ పెట్టొచ్చు. టమాటా రసాన్ని ముఖానికి రాసుకొని 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేసుకుంటే మొటిమలు పోతాయి. కాస్త టమాటా రసంలో కొంచెం తేనె వేసి గట్టి పేస్ట్‌లా చేసుకుని ముఖానికి రాసి 15 నిమిషాల తర్వాత కడిగేసుకుంటే చర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది. టమాటా రసంలో కొంచెం నిమ్మరసం లేదా దోసకాయ రసం కలిపి ముఖానికి రాసి 20 నిమిషాల కడిగేసుకుంటే ముఖంపై జిడ్డు పోతుంది.