కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్' అనే పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు మంగళవారం ప్రకటించింది. ఈ పథకం కింద భారత రక్షణ దళాల్లో చేరాలనుకునే యువతను 4 ఏళ్ల పదవీకాలానికి జవాన్లుగా నియమిస్తారు. నాలుగేళ్ల పాటు ఆర్మీలో పనిచేసిన తర్వాత దాదాపు 80 శాతం మంది సైనికులు విధుల నుంచి వైదొలుగుతారు. వారికి తదుపరి ఉపాధి మార్గాల కోసం రక్షణ శాఖ సహాయం చేస్తుంది. రిక్రూట్ అయిన వారిలో అత్యుత్తమమైన వారిని ఖాళీలు ఉంటే కొనసాగిస్తారు.