కర్నాటకలోని తుమకూరు సమీపంలోని గొరవనహళ్లి వద్ద మూడేళ్ల క్రితం జరిగిన బాలిక హత్య కేసు గుట్టు వీడింది. 2019లో కారులో వెళ్తున్న రూపేష్ అనే వ్యక్తిని 17 ఏళ్ల బాలిక లిఫ్ట్ అడిగింది. ఆమె ఒంటి నగలపై కన్నేసిన నిందితుడు కారులో ఎక్కించుకున్నాడు. ఓ ఆలయం వద్ద బాలికను హత్య చేసి నగలు దొంగిలించాడు. బాలిక మృతదేహంపై పెట్రోల్ పోసి తగులబెట్టాడు. పలుకోణాల్లో విచారణ జరిపిన పోలీసులు సోమవారం నిందితుడిని అరెస్టు చేశారు.