కొత్తగా పుట్టుకొస్తున్న వేరియంట్లతో కరోనా ఇప్పట్లో ప్రపంచాన్ని వీడేలా లేదు. కోవిడ్ ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు బీఏ 4, బీఏ 5 కేసులు తాజాగా ముంబైలో తొలిసారి వెలుగు చూశాయి. బీఏ 4 ముగ్గురికి, బీఏ 5 ఒకరికి సోకినట్లు తెలుస్తోంది. అయితే బాధితులంతా కోవిడ్ బారి నుంచి కోలుకున్నట్లు ముంబై కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు.