రైతులకు మేలు చేయడంలో ప్రతిపక్షాలతో కాదు..దేశంతో పోటీ పడుతున్నామని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. దేశం యావత్తు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోందని చెప్పారు. మూడేళ్లలో రైతన్నల కోసం లక్షా 28 వేల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. అన్నదాతలకు అండగా నిలిచిన ప్రభుత్వం మనదని వైయస్ జగన్ మోహన్ రెడ్డి సగర్వంగా చెప్పారు. ఏరువాకతో సాగుకు సన్నద్ధమవుతున్న అన్నదాతకు అండగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి వైఎస్సార్ ఉచిత పంటల బీమా పరిహారాన్ని అందించారు. 2021 ఖరీఫ్‌లో వైపరీత్యాలు, చీడపీడల వల్ల పంట నష్టపోయిన చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 15.61 లక్షల మంది రైతన్నలకు రూ.2,977.82 కోట్ల బీమా పరిహారాన్ని మంగళవారం వారి ఖాతాల్లో నేరుగా జమ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా చెన్నే కొత్తపల్లిలో జరిగిన కార్యక్రమంలో సీఎం వైయస్ జగన్ బటన్ నొక్కి రైతన్నల ఖాతాల్లో నగదు జమ చేశారు.