కొవిడ్ నుంచి కోలుకున్న వారిలో గుండె, కాలేయ, కిడ్నీ సమస్యలు తలెత్తుతున్నాయని నిపుణులు తేల్చారు. తాజాగా మానసిక సమస్యలు కూడా ఏర్పడుతున్నాయని గుర్తించారు. గట్టిగా అరవడం, చిరాకు, ఏడవడం, కుంగిపోవడం వంటి లక్షణాలుంటాయని తెలుస్తోంది. అయితే క్రమం తప్పని వ్యాయామం, పోషకాహారం తీసుకోవడం, వైద్యులను సంప్రదించడం ద్వారా అవి తొలగుతాయని వైద్యులు చెబుతున్నారు.