విజయవాడలో ఎండలు మళ్లీ మండిపోతున్నాయి. ఒక వైపు బానుడు భగభగలు, మరోవైపు ఉక్కపోతతో ప్రజానీకం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దీంతో వృద్ధులు, పిల్లలు అల్లాడిపోతున్నారు. రెండురోజుల క్రితం వాన కురవడంతో వాతావరణం చల్లబడింది. అయితే తిరిగి ఎండతీవ్రత పెరిగిపోవడంతో ప్రజలు ఇబ్బందిపడ్డారు. మంగళవారం విజయవాడలో 42.1°C డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో మధ్యాహ్న సమయంలో చాలాచోట్ల రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి.