కృష్ణా జిల్లాలోని భద్రిరాజుపాలెంలో రత్నకుమారి(19) అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు నందమూరు గ్రామానికి చెందిన సన్నీతో 4 నెలల క్రితం వివాహం జరిగింది. ఈ నెల 13న సెల్‌ఫోన్ కారణంగా రత్నకుమారి, సన్నీ మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన రత్నకుమారి కలుపు మందు తాగింది. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa