వంటగ్యాస్ సిలిండర్ డిపాజిట్ ధరలను ఇంధన సంస్థలు పెంచాయి. 14.2 కిలోల సిలిండర్ డిపాజిట్ ధరను 1,450 నుంచి రూ.2,200 కి పెంచారు. 5 కిలోల సిలిండర్ పై రూ.800 నుంచి రూ.1,150 కు పెంచారు. రెగ్యులేటర్‌కు ఇక నుంచి రూ.250 తీసుకోనున్నారు. పెంచిన ధరలు జూన్ 16 నుంచి అమల్లోకి రానున్నాయి. కొత్త కనెక్షన్లు తీసుకునే వారికి ఇవి వర్తిస్తాయి. ఉజ్వల యోజన వినియోగదారులకు ఈ ధరలు వర్తించవు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa