కర్ణాటకలోని దావణగెరె జిల్లాలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. జగళూరు పట్టణానికి చెందిన నిఖిత (25), తన 9 నెలల కొడుకు అనీశ్‌కు ఉరివేసి చంపి, తానూ ఆత్మహత్య చేసుకుంది. నిఖితకు ఏడాదిన్నర కిందట మనోజ్‌కుమార్ తో వివాహమైంది. అతను డబ్బు కోసం వేధించడంతో పుట్టింటికి వెళ్ళిన నిఖిత ఈ దారుణానికి పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.