ఏపీలోని నెల్లూరు జిల్లాలో క్షుద్రపూజల కలకలం రేగింది. ఆత్మకూరు మండలం పెద్దిరెడ్డిపల్లిలో తన కవల కుమార్తెలను కూర్చోబెట్టి వేణుగోపాల్ బుధవారం పూజలు చేశాడు. భయంతో చిన్నారులిద్దరూ కేకలు వేశారు. చుట్టుపక్కల వాళ్లు వచ్చేలోపే పునర్విక అనే బాలిక నోట్లో కుంకుమ కుక్కాడు. వెంటనే బాలికను ఆసుపత్రికి తరలించారు. మరో బాలిక పూర్వికను బంధువులు తీసుకుపోయారు. పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు.