గార్లదిన్నె మండల పరిధిలోని కనంపల్లి గ్రామంలోని సర్వే నెంబరు 155-2 లోని నారాయణస్వామి పేరుతో పత్తి పంట 5. 09 సెంట్లకు రూ. 1, 74, 831లు మరో వ్యక్తి శాంతమ్మ పేరుతో పత్తి పంట ఐదు ఎకరాలకు రూ. 1, 71, 740 పంట బీమా పరిహారాన్ని జాబి తాలో పొందుపరిచారు. ఒకే సర్వే నంబరుతో ఇద్దరికి బీమా నమోదు చేసిన విషయాన్ని ఇన్ఛార్జి వ్యవసాయాధికారిణి కృష్ణవేణి దృష్టికి తీసుకె ళ్లగా. ఒకే సర్వే నెంబరుతో ఇద్దరి పేరుతో బీమా నమోదైందని, ఇంకా వారి ఖాతాలో నగదు జమ కాలేదని చెప్పారు. వారి బ్యాంకు ఖాతాలను హోల్డ్ లో పెట్టాలని బ్యాంకు అధికారులకు తెలియచేశామన్నారు. రికార్డు లను పరిశీలించి అర్హులైన రైతులకు పంట బీమా అందిస్తామని చెప్పారు.