ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో సాధువులు మద్యం మత్తు లో హల్ చల్ చేశారు. ఫుల్లుగా మద్యం సేవించి ఒకరినొకరు ద్వేషించుకొంటూ వాగ్వివాదానికి దిగారు. కొద్దిసేపు తర్వాత ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో దాడులు చేసుకున్నారు. ఇది చూసిన స్థానిక ప్రజలు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చేసరికి సాధువులు అక్కడి నుంచి జారుకున్నారు.