గృహాలలోని వ్యర్ధాలను తీసుకెళ్లి పడవేసేందు కోసం ఏర్పాటు చేసిన గ్రీన్ అంబాసిడర్ కూలీలకు వేతనాలు అందక నానా ఇబ్బందులు పడుతున్నారు. జీతాల చెల్లింపులలో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో తాము కుటుంబాలను ఎలా పోషించాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బల్లికురవ మండలంలోని 21 గ్రామ పంచాయతీలలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా చెత్త సేకరణకు సేకరించిన చెత్తను కాల్చి వేసేందుకు 48 మందిని ప్రభుత్వం నియమించింది.