మార్టూరు మండలం వలపర్ల లో ఘరానా మోసం జరిగింది. బంగారు నగల కొనుగోలు పేరుతో ఒక గుర్తు తెలియని వ్యక్తి ఆ గ్రామంలోని సాయి గణపతి జ్యూయలరీ షాపు యజమానికి కల్లబొల్లి కబుర్లు చెప్పి దుకాణం నుండి తొంభై గ్రాములు విలువచేసే అయిదు బంగారు చైన్లను అపహరించుకుపోయాడు. వీటి విలువ మూడు లక్షల రూపాయల వరకు ఉంటుందని ఎస్సై రవీంద్రా రెడ్డి చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.