'మంకీపాక్స్' పేరుపై అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం ఆందోళన వ్యక్తం చేసింది. మంకీపాక్స్`పేరు వివక్షాపూరితంగా, అవమానకరంగా ఉందని, పేరు మార్చాలని డబ్ల్యూహెచ్వోకి లేఖ రాసింది. దీంతో మంకీపాక్స్ పేరు నుంచి మంకీని తొలగించి, మరేదైనా ప్రిఫిక్స్ ను యాడ్ చేసే అవకాశముందని వైద్య నిపుణులు భావిస్తున్నారు. అయితే, సంబంధిత అన్ని వర్గాలతో సంప్రదింపులు జరిపిన తరువాతే పేరు మార్చనున్నట్లు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.