ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నవంబర్ ఒకటి నుంచి ఏపీలో కొత్త బార్ పాలసీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 18, 2022, 01:42 AM

ఏపీలో మద్యం అంటేనే భయపడేలా చేసిన వైసీపీ ప్రభుత్వం కొత్త బార్ల పాలసీని తీసుకొచ్చింది. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక మద్యం పాలసీ రూపురేఖలు మార్చిన సంగతి తెలిసిందే. తాజాగా, 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్రంలోని బార్లకు కొత్త పాలసీ ప్రకటించారు.


పట్టణ ప్రాంతాలు, మున్సిపల్ కార్పొరేషన్ల, నగర పంచాయతీల పరిధిలో ఎన్ని బార్లు ఉండాలన్నది ఎక్సైజ్ కమిషనర్ నిర్ణయిస్తారు. మున్సిపల్ కార్పొరేషన్ లో 10 కిలోమీటర్ల పరిధిలో, మున్సిపాలిటీల్లో 3 కిలోమీటర్ల పరిధిలో బార్లు ఏర్పాటు చేసుకోవచ్చు. మూడేళ్ల కాలపరిమితితో కొత్త బార్లకు లైసెన్సులు. బార్లకు లైసెన్స్ ఫీజుతో పాటు నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ చార్జీలు ఏడాదికి 10 శాతం పెంపు. కొత్త బార్ పాలసీ సెప్టెంబరు 1 నుంచి అమలు.


ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఉత్తర్వులు వెలువరించారు. అటు, ఏపీలో ప్రస్తుతం ఉన్న బార్ల లైసెన్సులను మరో రెండు నెలల పాటు పొడిగించారు. వాస్తవానికి బార్ల లైసెన్సులు ఈ నెలాఖరుతో ముగియనున్నాయి. తాజా ఉత్తర్వుల నేపథ్యంలో, బార్ల లైసెన్సుల కాలపరిమితి జులై 1 నుంచి ఆగస్టు 31 వరకు పొడిగించారు. లైసెన్సులు పొడిగించిన కాలానికి ప్రభుత్వం ఈ నెల 27న బార్ల నుంచి ఫీజులు వసూలు చేయనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com