కండోమ్ అందరికి అందుబాటులో ఉండే ధరల్లోనే అన్ని చోట్ల దొరుకుతుంది. కానీ వెనిజూలలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ఇదిలావుంటే జనాభా నియంత్రణ, ఎయిడ్స్ వంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ కోసం కండోమ్ కంపల్సరీ. కండోమ్ వాడాలని ప్రభుత్వాలే ప్రచారం చేశాయి. కొన్ని ఉచితంగా కూడా అందజేశాయి. లేదంటే స్థోమతను బట్టి మెడికల్ షాపుల్లో కొనుగోలు చేస్తారు. ఫ్లేవర్ బట్టి మ్యాగ్జిమమ్ రూ.వంద వరకు ఉండొచ్చు. కానీ వెనిజులాలో మాత్రం కండోమ్ ధర కొండెక్కింది. అంటే అంత ఇంత కాదు.. రూ.60 వేలకు చేరింది. దీనికి సరయిన కారణమే ఉంది. అదేంటో తెలుసుకుందాం పదండి.
వెనిజులాలో కండోమ్ ప్యాకెట్ ధర రూ.60వేలకు చేరింది. ఇదే ధరకు ఆ దేశంలో హై ఎండ్ బ్రాండెడ్ టీవీలను కొనుగోలు చేయవచ్చు. మన దేశంలో అంతకుముంచి కొనుగోలు చేయవచ్చు. ఆ దేశంలో కండోమ్ ధర పెరగడానికి కారణం అక్కడి చట్టాలేనని తెలుస్తోంది. వెనిజులాలో అబార్షన్ చట్ట విరుద్ధం. చట్టవిరుద్ధంగా అబార్షన్లు చేస్తే కఠిన శిక్ష పడతాయి. దీంతో కండోమ్ కొనుగోలు చేయక తప్పడం లేదు.