ఎన్నో ఏళ్ల నుంచి పెండింగ్ లో ఉన్న 1998 డీఎస్సీ ఫైల్ పై సీఎం సంతకం చేశారని ఎమ్మెల్సీ కల్పలత రెడ్డి తెలిపారు. 20 ఏళ్ల నుంచి ఈ సమస్య పెండింగ్‌లో ఉందన్నారు. ఇప్పటివరకూ ఏ ప్రభుత్వమూ వారికి న్యాయం చేయలేదు. అభ్యర్థుల కోరిక మేరకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇంత ధైర్యంగా నిర్ణయం తీసుకోవడం ఒక్క వైయస్ జగన్ కే సాధ్యమని ఎమ్మెల్సీ కల్పలత రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం ఎమ్మెల్సీ కమిటీ వేసినా 98, 2008 డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరగలేదు. 2008 డీఎస్సీ అభ్యర్థుకుల కూడా సీఎం వైయస్ జగన్ న్యాయం చేశారు. తాజా నిర్ణయంతో 4,565 మందికి ఇప్పుడు న్యాయం జరగనుంది. త్వరలోనే గైడ్ లైన్స్ వస్తాయి...విధివిధానాలు రూపొందిస్తున్నారు అని తెలియజేసారు.