సైన్యంలో నియామకాలకు సంబంధించి కేంద్రం ప్రవేశపెట్టిన 'అగ్నిపథ్'పై ఆందోళనల నేపథ్యంలో విశాఖపట్నం రైల్వేస్టేషన్‌ను శనివారం మూసేశారు. ఇప్పటికే భారత్ బంద్‌ను ఆర్మీ ఉద్యోగార్థులు ప్రకటించిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. దాడులు జరిగే అవకాశముందని ఇంటెలిజెన్స్ హెచ్చరికతో మధ్యాహ్నం 12 గంటల వరకు విశాఖ రైల్వేస్టేషన్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే అక్కడ భారీగా పోలీసులు మోహరించారు.