ఈనెల 8వ తేదీ బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి నంద్యాలలోని కిచెన్ గార్డెన్ హోటళ్లో కల్తీ మాంసాలు , నిల్వ ఉంచిన ఆహార పదార్ధాలు నిల్వ ఉన్నాయని సాక్షాత్తు స్వయంగా తనిఖీలు నిర్వహించి , ఈ హోటల్ పై చర్యలు తీసుకోవాలని నంద్యాల పాత్రికేయులతో మాట్లాడుతూ ఫుడ్ సేఫ్టీ అధికారులని ఆదేశించినా చర్యలు తీసుకొని , కిచెన్ గార్డెన్ హోటల్ ను ఎందుకు సీజ్ చేయలేదని ఫార్వర్డ్ బ్లాక్ వామపక్ష పార్టీ (ఏ. ఐ. ఎఫ్. బి) రాష్ట్ర కార్యదర్శి రామినేని రాజునాయుడు నంద్యాల జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులను ప్రశ్నించారు. నంద్యాలలోని స్ధానిక పాత్రికేయులతో మాట్లాడుతూ కిచెన్ గార్డెన్ హోటల్ పై ఇప్పటికే సర్వత్రా విమర్శలు వస్తున్నాయనీ , ఫుడ్ సెఫ్టీ అధికారులు చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం తగదన్నారు. ఈ విషయంపై ప్రజా ప్రయోజనార్ధం కిచెన్ గార్డెన్ హోటల్ పై ప్రజా ప్రయోజనా వాజ్యం ( పిల్ ) ను దాఖలు చేయనున్నట్లు రాజునాయుడు తెలిపారు.