ఆఫ్ఘనిస్థాన్‌లోని కాబూల్‌లోని గురుద్వారా కర్తే పర్వాన్‌పై శనివారం తెల్లవారుజామున ఉగ్రవాదులు దాడి చేశారు. దీంతో గురుద్వారా సాహిబ్ ప్రాంగణంలో భారీ పలు పేలుళ్లు సంభవించాయి. రావడంతోనే గార్డుపై కాల్పులు జరిపి, పొట్టనబెట్టుకున్నారు. ప్రస్తుతం గురుద్వారాలో 15 మంది ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడ ఇంకా కాల్పులు జరుగుతున్నట్లు సమాచారం