60 ఏళ్లు దాటినా కూడా ఎముకలు పటిష్టంగా బలంగా ఉండాలంటే తినే ఆహారంలో కాల్షియం తగిన మోతాదులో ఉండేలా చూసుకోవాలి. విటమిన్-సి ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. నారింజ, బత్తాయి, నిమ్మ, ఉసిరికాయ, జామపండులను తినడం అలవాటు చేసుకోవాలి. చేపలు, రొయ్యలు, పీతలు, పప్పులు తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. క్యాబేజీ, పాలకూర, తోటకూర, చేపలు, కాలేయం వంటి వాటిలో విటమిన్-కె పుష్కలంగా ఉంటుంది. ఇవి ఎముకల బలానికి తోడ్పడుతాయి.