'అగ్నిపథ్' పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న విషయం సుప్రీంకోర్టుకు చేరింది. న్యాయవాది విశాల్ తివారీ సుప్రీంకోర్టులో శనివారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ పథకాన్ని సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి అధ్యక్షతన సమీక్షించాలని కోరారు. 'అగ్నిపథ్'పై జరిగిన హింసాత్మక ఘటనపై దర్యాప్తు చేసేందుకు సిట్‌ను ఏర్పాటు చేయాలని పిటిషనర్ విజ్ఞప్తి చేశారు. హింసాకాండపై సుప్రీంకోర్టులో స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేయాలనే డిమాండ్ చేశారు.