విడాకుల విషయంలో కర్నాటక హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. బెంగళూరుకు చెందిన మహిమ అనే మహిళను ముంబై వాసి 1998లో పెళ్లి చేసుకున్నాడు. అతడికి పెళ్లి సమయంలో రూ.9 లక్షలు, బంగారం పెట్టారు. 2001లో వారు విడాకులు తీసుకున్నారు. అయితే కట్నం, బంగారం తిరిగివ్వడానికి అతడు అంగీకరించలేదు. దీనిపై కర్నాటక హైకోర్టును బాధితురాలు ఆశ్రయించింది. డబ్బు, బంగారం ఇవ్వాల్సిందేనని కర్నాటక హైకోర్టు శుక్రవారం తీర్పు ఇచ్చింది.