ఓటరు జాబితాతో ఆధార్ అనుసంధానంపై కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఓటర్ల జాబితాతో ఆధార్‌ను అనుసంధానం చేయడం, సర్వీస్ ఓటర్లకు లింగనిర్ధారణతో కూడిన ఓటరు జాబితాను రూపొందించడం, యువ ఓటర్లు ఏడాదికి నాలుగుసార్లు ఓటరు జాబితాలో నమోదు చేసుకునే అవకాశం కల్పించనుంది. దీనిపై శుక్రవారం నాలుగు నోటిఫికేషన్లను కేంద్రం జారీ చేసింది. ఓటరు జాబితాలో ఒకే వ్యక్తికి రెండు ఓట్లు ఇక ఉండవని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు.