గుడివాడ రైల్వే జంక్షన్ స్టేషన్ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా టూ టౌన్ సిఐ దుర్గారావు పర్యవేక్షణలో పోలీసులు పటిష్ట చర్యలు తీసుకున్నారు. ప్రజలు వదంతులను నమ్మవద్దని సిఐ దుర్గారావు విజ్ఞప్తి చేశారు. రైల్వే స్టేషన్లో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. నిన్న హైదరాబాదులో రైల్వే స్టేషన్ లో అల్లర్ల నేపథ్యంలో గుడివాడ పోలీసులు అప్రమత్తమయ్యారు.