కృష్ణాజిల్లా: ఆర్మీలో నూతనంగా ప్రవేశపెట్టనున్న ‘అగ్నిపథ్’కు వ్యతిరేకంగా జరుగుతున్న అల్లర్ల నేపథ్యంలో గన్నవరం పోలీసులు అప్రమత్తమయ్యారు. రైల్వే స్టేషన్, బస్టాండ్‌తో పాటు పలు ప్రధాన కూడళ్లలో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. రైల్వే స్టేషన్‌తో పాటు పరిసర ప్రాంతాలు, రైల్వే ట్రాక్‌ల వెంబడి పోలీసులు ముందస్తు తనిఖీలు నిర్వహిస్తున్నారు. టికెట్లు ఉన్నవారినే స్టేషన్లోకి అనుమతి. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై పూర్తి నిఘా ఏర్పాటు చేశారు. గన్నవరం సీఐ భద్రతా ఏర్పాట్లను నిరంతరం సమీక్షిస్తోన్నారు. రైల్వే స్టేషన్ అన్ని గేట్లు వద్ద అదనపు బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేశారు.