స్థానిక ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ అవినీతిని మరియు చెత్తపై పన్నుల భారాన్ని మోయలేక పోతున్నామని ప్రశ్నించిన ఇంజనీర్ నాగబాబు పై కేసులు మోపాలని హుకుం జారీ చేసిన వెల్లంపల్లి తీరును నిరసిస్తూ, టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో నాగబాబు ను పరామర్శించిన జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ అధికారులతో మాట్లాడి తక్షణమే నాగబాబు విడిపించి బయటికి తీసుకు వచ్చిన పోతిన మహేష్ ప్రశ్నించే ప్రతి గొంతును అరెస్టు చేస్తే పోలీస్ స్టేషన్ లు చాలవని సమాధానం చెప్పలేకే వెల్లంపల్లి పారిపోయారని వెల్లంపల్లి అవినీతి అక్రమాలు పశ్చిమ నియోజకవర్గ ప్రజలు అడుగడుగునా ప్రశ్నించినందుకు ఆగ్రహంతో ఊగిపోయారని, ప్రశ్నించే గొంతులను పోలీసు వారిని అడ్డంపెట్టుకుని అరెస్టు చేస్తే జనసేన పార్టీ చూస్తూ ఊరుకోదని, సామాన్య ప్రజల తరఫున ఎంత వరకైనా పోరాటం చేస్తామని వెల్లంపల్లి ఇదే చివరి ఎన్నికలని రాబోయే ఎన్నికల్లో ఓటమి తప్పదని గెలిచేది జనసేన పార్టీ తరఫున పోతిన మహేష్ అని వెల్లంపల్లి అవినీతిపై తప్పక విచారణ చేయించి అతనిపై కేసులు నమోదు చేసి తీరుతామని మహేష్ హెచ్చరించారు. ప్రజా వ్యతిరేక పాలన పై ఇది ప్రజల తిరుగుబాటు అని రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాభవం తప్పదని హెచ్చరించారు