అగ్నిపత్ కు వ్యతిరేకంగా నిరసన జ్వాలలు కొనసాగుతున్న సమయంలో తిరుపతి సెంట్రల్ రైల్వే స్టేషన్ ఆక్టోపస్ బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. తిరుపతి రైల్వే స్టేషన్ కు ఉన్న అన్ని మార్గాలను మూసివేసి కేవలం ప్రధాన మార్గం ద్వారా ప్రయాణికులను అనుమతిస్తున్నారు. ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీలు చేయడంతోపాటు రైలులో వస్తున్న ప్రయాణీకులను ప్రశ్నిస్తున్నారు. రైల్వే స్టేషన్ లోపల, బయట కూడా ఆక్టోపస్ బలగాలు మోహరించాయి.