తిరుమల సుప్రభాత సేవకు నకిలీ ఆధార్ కార్డులతో వెళ్తున్న భక్తులను టిటిడి విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. లక్కిడిప్ విధానంలో ఫేక్ ఐడిలతో సుప్రభాత సేవా టిక్కెట్లు పొందిన మహారాష్ట్ర లాతూర్ కి చెందిన భక్తులపై పోలీసులుకు ఫిర్యాదు చేసిన విజిలెన్స్ అధికారులు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.