పెళ్లికి కుజదోషం అడ్డు రావడంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. కర్నాటక శివమొగ్గ జిల్లా తీర్థనహళ్లి పోలీస్ స్టేషన్లో లేడీ కానిస్టేబుల్ సుధ, ఫారెస్ట్ రేంజర్ ప్రవీణ్ ఆరేళ్లుగా ప్రేమలో ఉన్నారు. సుధ జాతకంలో కుజదోషం ఉందని ప్రవీణ్ తల్లి పెళ్లికి నిరాకరించింది. దీంతో విషం తాగి, ఇటీవల ఇద్దరూ ఆత్మహత్యాయత్నం చేశారు. అయితే చివరి నిమిషంలో ప్రవీణ్ విషం తాగినట్లు నటించి జారుకున్నాడు. చికిత్స పొందుతూ సుధ శుక్రవారం మరణించింది.